8 July, 2026 | 10:01 AM

బాధిత కుటుంబానికి అండగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

08-07-2026 08:57 AM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామానికి చెందిన ఆత్రం మహేష్ నివాసంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై, కుటుంబ సభ్యులు తమ నిత్యావసర వస్తువులు, దుస్తులు, ఇతర సామగ్రిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.ఈ ఘటన గురించి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వెంటనే స్పందించి బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకుని, తక్షణ సహాయంగా నిత్యావసర వస్తువులు, కొత్త దుస్తులు, ఒక క్వింటాల్ బియ్యం, ఇతర అవసరమైన దాదాపు 20,000 వేల విలువచేసే సామగ్రిని అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బాదితులు అధైర్య పడొద్దని ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,సర్పంచ్ లు మరియు కోనేరు అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.