calender_icon.png 10 October, 2025 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భిణులు పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి

08-10-2025 12:00:00 AM

చిట్యాల, అక్టోబర్  7(విజయ క్రాంతి): గర్భిణీ స్త్రీలు ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత మంగళవారం సూచించారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మొదటి అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ  అన్ని పోషక విలువలతో కూడిన తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలున్న ఆహార పదార్థాలు అయిన  పండ్లు,పాలు, గుడ్లు, మొలకెత్తిన గింజలు, జొన్న రొట్టెలు, ఆకుకూరలు, కూరగాయలు ప్రతి నిత్యము మన ం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలని అన్నారు. 

ప్రతినిత్యం ఎదుగుతున్న పిల్లలు,  గర్భిణీ స్త్రీలు కడుపులో ఉన్న బిడ్డకు, తనకు ఎక్కువ మోతాదులో పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలని సూచిం చారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ వలన కూడా చాలా అనారోగ్యానికి గురవుతున్నామని పోషణ ఆరోగ్యం మీద అవగా హన కల్పంచి, పోషణ మాసం పైన ప్రతిజ్ఞ చేశారు.  జడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ హెచ్‌ఎం  సుశీల పద్మజ టీచర్ నర్ర సరళ,అంగన్వాడి టీచర్లు దాడి అరుణ, అపర్ణ, జ్యోతి, శోభ, కృష్ణవేణి, మమత, ఆశా కార్యకర్తలు సైదమ్మ, శైలజ, జయమ్మ,  కవిత, మెట్ల సైదులు,పాపయ్య, సరిత, స్వరూప,సుజాత  తదితరులు పాల్గొన్నారు.