12 March, 2026 | 6:21 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌కు ఘన స్వాగతం

16-09-2024 04:11 AM

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 15: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసీ.శేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా మహేష్‌గౌడ్‌కు.. తెలంగాణ సాంప్ర దాయ బద్దంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈసీ.శేఖర్.. మహిళామణులతో కలిసి బోనాలతో ఘన స్వాగతం పలికారు. మహేష్ గౌడ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.