నక్షాలో డొంక.. అడిగేదెవరు మాదైనంక..!
- డొంకలు మాయం-చర్యల శూన్యం
- రికార్డులో లేని సర్వే నెంబర్లతో నమోదు
- తదుపరి అధిక ధరలకు విక్రయాలు
- ఆక్రమణలను అడ్డుకోవాలని స్థానికుల వేడుకోలు
మోతె, మే 27 : రోజురోజుకు భూముల రేట్లు గణనీయంగా పెరుగుతుండడంతో భూ యజమానులు తమ పక్కన ఉన్న ఖాళీ జాగాలను అక్రమంగా ఆక్రమించుకొని స్వార్థపూరితంగా తనదిగా మార్చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే విధానం ప్రస్తుతం మోతే మండలంలోని నామవరం వద్ద జరుగుతోంది.ఖమ్మం- విజయవాడ జాతీయ రహదారి మధ్య ఉన్న మోతె మండలం నామవరంలో రోడ్డు వెంబడి ఉన్న భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.
దీంతో కుంట భూమిని సైతం వదలకుండా వినియోగంలోకి తీసుకొస్తున్నారు. ఇదే క్రమంలో రోడ్ల వెంబడి ఉన్న ప్రభుత్వ నక్ష డొంకలను ఆక్రమించుకొని రికార్డులో లేని భూముల సర్వే నెంబర్లను నమోదు చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. నామవరం స్టేజి నుంచి గుంజులూ రు స్టేజి కి నామవరం గ్రామం మీదుగా ఏడు కిలోమీటర్ల దూరం ఉంది ఈ రోడ్డులో గతంలో గ్రామానికి, వ్యవసాయ పొలాలకు మాత్రమే వాహనాలు వెళ్ళేవి, సూర్యపేట జిల్లా కేంద్రంగా ఏర్పడడం కోదాడ నియోజకవర్గానికి వెళ్లేందుకు దగ్గర అయినందున మోతె మండలంలోని 29 గ్రామాల ప్రజలు ఈ రహదారి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు.
విజయవాడకు వెళ్లే భారీ వాహనా లు కూడా ఈ రోడ్డు నుంచే వెళుతున్నందున ఈ రహదారి వెంబడి ఉన్న ఎకరం భూమి రూ.50 లక్షలు పలుకుతుంది. ఖమ్మం హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు ఈ రోడ్డు వెంబడి భూములు కొనుగోలు చేస్తున్నందున ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఇదే అదునుగా రోడ్డు వెంబడి ఉన్న రైతులు రోడ్డుకు ఆనుకొని సేద్యం చే యడంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఈ రహదారి లోని పట్టా భూ ముల వెంబ డి గతంలో సుమారు 20 మీటర్ల వెడల్పుతో ప్రభుత్వ నక్ష డొంకలు ఉండేవి. ఆ డొంకల్లో పెద్ద పెద్ద చెట్లు పెరగడంతో పశువుల కాపర్లు వాటిని అక్కడ మేపేవారు. రోడ్డు వెంబడి ఉ న్న తాటి, ఈత చెట్లకు గీత కార్మికులు కల్లు విక్రయించేవారు. ప్రస్తుతం భూముల ధర లు పెరగడంతో డొంకలను ఎక్స్ కవేటర్లతో కలిపేసుకుని రహదారిని ఆనుకొని రైతులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మొ త్తానికి నక్షాలో డొంక.. అడిదెవరు మాధైనంక.. అన్న చందంగా స్వార్థపరులు ఆక్రమ ణలు చేస్తున్నట్లు స్థానికంగా పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి.
డొంకల ఆక్రమణతో ప్రమాదాలు:
నామవరం గ్రామానికి వెళుతుండగా గ్రామ శివారులో సర్వేనెంబర్ 903 వెంబడి ప్రభుత్వ నక్ష డొంక పట్టా భూమికి రోడ్డుకు మధ్యలో 20 మీటర్ల మేర ఎకరం విస్తీర్ణంలో పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి. ఈ వృక్షాల వెంబడి గీత కార్మికులు కల్లు విక్రయించేవారు. ఇదే డొంక వెంబడి ఉపా ధి హామీ పథకంలో మొక్కలు నాటడంతో అవి పెరిగి వృక్షాలుగా మారాయి. ఆ వృక్షాలు తమ భూమికి, మెయిన్ రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని గుర్తించిన అక్రమార్కులు ఎక్స్ కవేటర్ లతో చెట్లను తొలగించి గుంతలో మట్టిని నింపి రహదారిపై ఆనుకొని ఫెన్సింగ్ వేస్తున్నారు.
వృక్షాలను తొలగించడంతో వాటి ఆధారంగా నివసిస్తున్న పక్షుల ఆవాసాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ డొంకల్లో మూలమలుపులు ఉన్నందున ముందు వస్తున్న వాహనాలు పక్కకు వెళ్లేవి, ఇప్పుడు రోడ్డుకు ఆనుకొని ఉన్న డొంకలను తొలగించడంతో ఆ మూలమలుపుల వద్ద వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని వాహనదారులు పేర్కొంటున్నారు.
పట్టా భూములుగా మార్చి విక్రయాలు:
ప్రభుత్వ నక్షలో ఉన్న సుమారు 30 గుంటల పైబడిన డొంకను కొందరు స్వార్థపరులు ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తు న్నారని, దీని విలువ రూ.40 లక్షలు ఉండవచ్చని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ డొంకలో పెద్దపెద్ద తాటి చెట్లు, ఈత వ నాలను కూడా అధికారుల అనుమతులు లే కుండా తొలగిస్తున్నారు. దీనికి సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 9లోనీ ప్రభుత్వ నక్షలో గల డొంకలను గతంలోనే కలుపుకొని నామరూపాలు లేకుండా చేసి ప్రస్తుతం పట్టా భూ ములుగా మార్చి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే సర్వే నెంబర్ 930లో కూడా ఉన్న డొంక భూ కబ్జాదారులకు వశమైనట్టు స్థానికుల ద్వారా తెలిసింది.
ఇక్కడ ఇలా ఉంటే గుంజలూరు సమీపంలో రహదారికి ఆనుకొని ప్రహరీలు నిర్మిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడు తున్నారు. ప్రభుత్వ నక్ష డొంకలను తొలగిస్తున్నందున పశువులతోఇబ్బందులు పడుతు న్నారు. నక్ష డొంకల్లో చెట్లను తొలగిస్తున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి వ్యవహార శైలి పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికా రులు స్పందించి అక్రమణ గురైన ప్రభుత్వ నక్ష డొంకలను పరిశీలించి చెట్లను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవా లని స్థానికులు కోరుతున్నారు.
రోడ్డు వెంట భూముల ఆక్రమణను అరికట్టాలి
నామవరం నుంచి గుంజలూరు స్టేజికి వెళ్లే రోడ్డు వెంబడి ఉన్న భూ ముల రైతులు పక్కన నక్షాలో సైతం ఉన్న డొంకలను స్వార్థపూరితంగా ఆక్రమించుకొని సేద్యం చేస్తున్నడం తో పాటు రోడ్డుకు ఆనుకొని ఫెన్సిం గ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివలన వాహనదారులు మూల మలుపుల వద్ద ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డు వెంట నిత్యం ఏదో ఓచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నవి. రెవి న్యూ, ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు వెంబడి ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించి అవి ఆక్రమణకు గురికాకుండా చూడాలి.
సరసాని సుధాకర్ రెడ్డి, రైతు, నామవరం
రోడ్డు వెంబడి ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు
మండలంలో ఏ రోడ్డు వెంబడి ఉన్న ప్ర భుత్వ భూములనైనా స్వార్థపూరితంగా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. నామవరం నుం చి గుంజలూరు స్టేజికి వెళ్లే మార్గమధ్యలో 903 సర్వే నెంబర్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు రైతులు ఆక్రమించుకొని అందులో ఉన్న చెట్లను తొలగించుకొని ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది ఆర్ అండ్ బి, రెవెన్యూ అధికారులను పంపించి పరిశీలన తదుపరి ఆక్రమించినట్లు రుజువైతే తప్పక చర్యలు తీసుకుంటాము.
ఎం.వెంకన్న, తహసీల్దార్, మోతె






