22 July, 2026 | 12:32 PM

ఆర్టీసీ బస్, స్కార్పియో ఢీ: ఒకరు మృతి.. 14మందికి తీవ్రగాయాలు

22-07-2026 12:01 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ముందు వెళ్తున్న బైకును తప్పించబోయి అతి వేగంతో ఆర్టీసీ బస్సును(RTC bus) స్కార్పియో ఢీకొన్న ఘటనలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న వ్యక్తి శరత్ గౌడ్ (28)మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామ శివారు 167 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ఆమనగల్లు మండలం కొనాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి టిజి 07ఏపీ 0044 నెంబర్ గల స్కార్పియోలో నాగర్ కర్నూల్ వైపు వస్తుండగా ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొంది.

ఈ ఘటనలో స్కార్పియో వాహనం పూర్తిగా ధ్వంసం కాగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి  శరత్ గౌడ్ మృతి చెందాడు. ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు కోట శ్రీనివాస్, బస్సులో ప్రయాణిస్తున్న మరో 14మందికి తలకు ముక్కు, మోకాళ్ళ ప్రాంతంలో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి డిఎం షాలిని, తడూరు ఏఎస్సై బాలు నాయక్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి సందర్శించారు.