7 July, 2026 | 4:34 PM

దేశంలో పెరుగుతున్న ఐటీ వ్యయాలు

16-05-2024 12:05 AM

ఈ ఏడాది 138 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా

గార్టనర్ రిపోర్ట్

న్యూఢిల్లీ, మే 15: ప్రపంచ ఐటీపై వ్యయపర్చడం మందగించినప్పటికీ, భారత్‌లో రెండంకెల్లో వృద్ధిచెందుతుందని గార్టనర్ నివేదిక పేర్కొంది. 2024లో ఇండియాలో ఐటీ వ్యయాలు 13.2 శాతం వృద్ధితో 138.2 బిలియన్ డాలర్లకు చేరతాయని అంచనా వేసింది. అంతర్జాతీయంగా ఐటీ స్పెండింగ్ 8 శాతం పెరిగి 5.06 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. గార్టనర్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది భారత్‌లో సాఫ్ట్‌వేర్‌పై  వ్యయం రికార్డుస్థాయిలో 18.6 శాతం వృద్ధిచెందుతుంది. సవాలుతో కూడిన ప్రస్తుత వాతావరణంలో సాఫ్ట్‌వేర్‌ను దన్నుగా చేసుకుని వృద్ధిని, నిర్వహణా సామర్థ్యాన్ని, కస్టమర్ ఎక్సిపీరియన్స్‌ను సాధించాలని భారతీయ సీఐవోలు భావిస్తున్నారని గార్టనర్ వివరించింది. అలాగే జనరేటివ్ ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ (జెన్ ఏఐ) వృద్ధికి, నవకల్పనకు కొత్త అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నందున, భారతీయ సీఐవోలు ప్రస్తుతం అటువంటి దశకు ప్రణాళికలు వేస్తున్నారన్నది. అయితే స్వల్పకాలికంగా సాఫ్ట్‌వేర్ పరిశ్రమకు జెన్ ఏఐ ద్వారా వచ్చే ఆదాయం తక్కువే అయినప్పటికీ, తదుపరి సంవత్సరాల్లో భారీగా పెరుగుతుందని గార్టనర్ అంచనా వేసింది.