22 April, 2026 | 2:35 PM

Breaking News

గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •  

పవర్‌ఫుల్ పోలీస్‌గా ఆది

17-11-2024 12:00 AM

యువ కథానాయకుడు ఆది సాయికుమార్ హీరోగా యశ్వంత్ దర్శకత్వంలో శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రదీప్ జూలూరు నిర్మిస్తున్న క్రైమ్- యాక్షన్ థ్రిల్లర్ ‘సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్’. మేఘలేఖ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాకేందు మౌళి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రణవ్ గిరిధరన్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు డీవోపీ రవీంద్రనాథ్ కాగా, రాజేశ్ లంక ఫైట్స్ మాస్టర్‌గా పనిచేయనునన్నారు. ఈ సినిమా శనివారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి హీరో సందీప్ కిషన్ క్లాప్ ఇచ్చారు. సాయికుమార్ మేకర్స్‌కు స్క్రిప్ట్ అందించారు. అనంతరం మేకర్స్ ఇంటెన్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఆది సాయికుమార్‌ను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రజెంట్ చేసిన ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంది. మూవీ లాంచింగ్ ఈవెంట్‌లో సాయికుమార్ మాట్లాడుతూ.. ‘మనం చేసే పని త్రికరణ శుద్ధిగా చేస్తే విజయం దానంతట అదే వస్తుంది’ అన్నారు. ఈ నెల 18 నుంచి షూట్ స్టార్ట్ కాబోతుందని హీరో ఆది సాయికుమార్ తెలిపారు.

చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న రాకేందు మౌళితోపాటు డైరెక్టర్ యశ్వంత్, ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ, నిర్మాత ప్రదీప్ జూలూరు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.