22 April, 2026 | 12:39 PM

Breaking News

కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •  

జనవరిలో కృష్ణ ఆఖరి చిత్రం విడుదల

17-11-2024 12:00 AM

తెలుగు చలనచిత్ర చరిత్రలో చెరగని ముద్ర వేసి, సౌజన్యానికి, సాహసానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచారు దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ. ఆయన నటించిన చివరి చిత్రం ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’. ఈ సినిమాను మేకర్స్ 2025, జనవరి 3న విడుదల చేయనున్నారు. అంబుజా మూవీస్ రామ్ ఫిల్మ్స్ బ్యానర్లపై హెచ్ మధుసూదన్ దర్శకనిర్మాతగా రూపొందిన ఈ సినిమాలో యశ్వంత్, సుహాసిని జంటగా నటించగా నాగబాబు, ఆలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఎంఎం శ్రీలేఖ సంగీతం సమకూర్చారు. శనివారం కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన చిత్రబృందం ఈ వేదికపై ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మధుసూదన్ మాట్లాడుతూ.. ‘కృష్ణతో సినిమా రూపొందించడం తన అదృష్టంగా భావించాను. ఆయన నటించిన ఆఖరి చిత్రం విడుదల కాని చిత్రాల జాబితాలో ఉండకూడదనే పట్టుదలతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం’ అని తెలిపారు.

ఈ సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకనిర్మాత సునీల్‌కుమార్‌రెడ్డి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ లవ్లీ మధుమిత, కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాదర్ గోరి, పద్మాలయశర్మ, సహ నిర్మాత బండ్రి నాగరాజ్ గుప్తా పాల్గొన్నారు.