28 April, 2026 | 8:33 PM

ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన

28-04-2026 06:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు పార్టీని మారడంపై మంగళవారం నిర్మల్ లో రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పార్టీ మారిన ఎంపీల పోస్టర్లతో వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆదరణతో గెలుపొంది రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారిన ఎంపీలకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.