అందరికీ నచ్చే ఆస్మాన్

17-09-2026 | 05:30am

మేఘాంశ్ శ్రీహరి(Meghansh Srihari) హీరోగా దర్శకుడు రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై వెంకటేశ్ కొండారు, శ్రీకాంత్ మన్నెం(Srikanth Mannem) నిర్మిస్తున్నారు. శ్రీహరి జయంతి(Srihari Jayanthi) సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్‌లుక్(Movie First Look), మోషన్ పోస్టర్‌(Motion Poster)కు మంచి స్పందన వచ్చింది. తాజాగా మేఘాంశ్ శ్రీహరి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌(Teaser launch event)కు రా కింగ్ మంచు మనోజ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. “నా తమ్ముడు మేఘాంశ్ ‘ఆస్మాన్’ కోసం రావడం ఆనందంగా ఉంది. శ్రీహరి అంకుల్ మమ్మల్ని ఎత్తుకుని పెంచారు. నేను మేఘాంశ్‌ను ఎత్తుకున్నా (నవ్వుతూ). సినిమా ఉన్నంత కాలం రియల్ స్టార్ శ్రీహరి ఉంటారు. మేఘాంశ్‌ను నేను ఎలా చూడాలనుకున్నానో టీజర్‌లో అలా కనిపించాడు. టీజర్ నాకు చాలా నచ్చింది. ప్రశాంత్ బీజీఎం అదిరిపోయింది. అరబిక్‌లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ‘ఆస్మాన్’ గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.

మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. “ఆస్మాన్’ మూవీని ఎంజాయ్ చేస్తూ చేశా. షోయబ్ వల్లే ఈ చిత్రం ఈ స్థాయిలో వచ్చింది. రాయంచ అద్భుతంగా నటించారు. రామ్ నందన్ ఈ సినిమాని గొప్ప స్థాయిలో తెరకెక్కించారు. ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అది నా ప్రామీస్‌” అని చెప్పారు. శివాత్మిక మాట్లాడుతూ.. “ఆస్మాన్’ టీజర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, మేఘాంశ్ డైలాగ్స్ బాగున్నాయి. రాయంచ ముద్దుగా కనిపిస్తున్నారు. మేఘాంశ్ నా స్కూల్లో సీనియర్. ‘ఆస్మాన్’తో ఆయనకు మంచి విజయం దక్కాలి.

ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని తెలిపింది. చిత్ర దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ.. “ఆస్మాన్’ టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నా. చాలా వరకు రివీల్ చేశామనే చెప్పొచ్చు. మోషన్ పోస్టర్ నుంచి మొదలైన సస్పెన్సును టీజర్‌తో పెంచాం. మా హీరో మేఘాంశ్‌కు ప్రతిభతోపాటు అంకితభావం ఉంది. షోయబ్ మంచి విజువల్స్ ఇచ్చారు. ప్రశాంత్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. రాయంచ అద్భుతంగా నటించారు. సినిమా రిలీజ్ వరకు ఏదో ఒక మిస్టరీ ఇస్తూనే ఉంటాం” అని తెలిపారు.

‘మేం చెప్పాలన్నకున్నదంతా టీజర్ రూపంలో చెప్పేశాం. శ్రీహరి ఫ్యామిలీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంద’ని నిర్మాత వెంకటేశ్ కొండారు అన్నారు. హీరోయిన్ రాయంచ మాట్లాడుతూ.. “నాకు ఇంత మంచి చిత్రంలో ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. షోయబ్ మా అందరినీ అద్భుతంగా చూపించారు. ఈ చిత్రంతో మేఘాంశ్‌కు మంచి విజయం దక్కాలి” అని చెప్పింది. “ఆస్మాన్’కి పని చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేశా”నని ప్రశాంత్ ఆర్ విహారి తెలిపారు. 

మరిన్ని వార్తలు