15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పేద జంటల పెళ్లిళ్లకు అభిమన్యు గ్రూప్ అండ

14-02-2026 09:43 PM

మహాశివరాత్రి సందర్భంగా 25 జంటలకు సామూహిక వివాహాలు

జైనూర్/సిర్పూర్ (యు),(విజయక్రాంతి): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు) మండలం మహాగం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న సామూహిక వివాహాలకు అభిమన్యు గ్రూప్ చేయూతనిచ్చింది. ఈ నెల 16న సంత్ శ్రీ సూరోజి బాబా ఆశ్రమంలో 25 పేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అభిమన్యు గ్రూప్ తరఫున నిధులు జమ చేయడంతో పాటు అన్నదానానికి అవసరమైన నిత్యావసర సరుకులను కమిటీ సభ్యులకు అందజేశారు. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ రావు మాట్లాడుతూ... ఆశ్రమంలో ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా సామూహిక వివాహాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిరుపేద కుటుంబాలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరిపించడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.

అభిమన్యు గ్రూప్ నిర్వాహకుడు మెస్రం శేఖర్ బాబు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా పేద జంటలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. మంచి కార్యక్రమాలకు దాతలు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహాగం సర్పంచ్ జానే రావు, ఉపాధ్యాయులు లింగు, దత్తు, దేవ్ రావు, బండు, యువనేతలు మెస్రం అంబాజి రావు, సర్‌మెడి ఆనంద్ రావు, సీతారాం, కృష్ణమూర్తి, యాదవ్ రావు, మండల సర్పంచులు నగేష్, భూపతి, ఉయిక చందన్ షావ్ తదితరులు పాల్గొన్నారు.