విస్తరిస్తున్న కబ్జాకోర(రు)లు!
- మేళ్లచెరువులోని సర్వేనంబర్ 874లో ప్రభుత్వ భూమి కబ్జాకు ‘సిద్ధం’
- కంపచెట్లు తొలగింపు - ఫెన్సింగ్ ఏర్పాటు
- గతంలోనూ 18 ఎకరాలు భూమినీ మింగేందుకు ప్రయత్నం
- మళ్లీ అదే వ్యక్తులు ప్రభుత్వ భూమి కబ్జాకు నడుం బిగింపు
- ఓ సిమెంట్ కంపెనీకి చెందిన వ్యక్తులంటూ ప్రచారం
- కబ్జాకోరుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికుల వేడుకోలు
సూర్యాపేట ఆగస్టు 2 (విజయక్రాంతి) : రోజురోజుకు భూముల ధరలకు రెక్కలు రా వడంతో అందినకాడికి ఆక్రమించుకునే ప్ర యత్నాలు చేస్తున్నారు భూ బకాసురులు. ఇ ది ఎక్కడో ఒకచోట జరుగుతున్న తంతు కా దు. ఇటీవల చాలా చోట్ల ఇటువంటి ఘటన లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు జిల్లాలోని మేళ్లచెరువులో భూబకాసురులు మరోమారు ప్రభుత్వ భూమి కబ్జాకు సిద్ధం అయ్యారు. మేళ్లచెరువు సర్వేనెంబర్ 874లో గల ప్రభుత్వ భూమిని జెసిబిలతో చదును చేసి కంపచెట్లను తొలగించి ఆ భూమి చు ట్టూ ఫెన్సింగ్ వేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
గతంలో ఇదే సర్వే నెంబర్ గల భూ మిని దాదాపు 20 ఎకరాల మేర చదును చేసి మట్టితోలి, జీవో నెంబర్ 59 ద్వారా రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రయత్నం చేశారనే విషయాలు గతంలో వెలుగులోకి వచ్చాయి. నాడు ప్రభుత్వం భూకబ్జాపై ఉ క్కుపాదం మోపి కబ్జాకోరుల నుండి భూ మిని స్వాధీనం చేసుకొని పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. మరల ఇప్పుడు అదే భూ కబ్జాదారులు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమయ్యారు.
రూ.కోట్లు విలువచేసే ఈ భూమిని కబ్జా చేసేందుకు మేళ్లచెరువు లో ఓ సిమెంట్ కంపెనీ పేరు చెప్పుకొని ఓ ఆ కంపెనీకి చెందిన భూమాఫియా గ్యాంగ్ కబ్జాకు రంగం సిద్ధం చేస్తుకొన్నట్లు తెలుస్తుంది. ఓ బడా సిమెంట్ కంపెనీ యజమా ని బావమరిది, ఆ బామ్మర్ది ఆదేశాల మేరకు అతని అనుచరుడు, కొంతమంది వ్యక్తులు ఇటీవల భూమిని చదును చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
భూమి ధర పెరగడంతో కబ్జాకు యత్నం
మేళ్లచెరువు సర్వేనెంబర్ 874లో 567 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.ఇందులో 350 ఎకరాల భూమి మైహోమ్ సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి మైనింగ్ కోసం లీజుకు ప్రభుత్వం ఇచ్చింది. 50ఎకరాల మేర తాసిల్దార్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, హై స్కూల్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ఇం డ్లు ఉన్నాయి.మరో 50 ఎకరాల్లో రైతులుకు పట్టాలు ఇచ్చింది ప్రభుత్వం. 2021లో మైహోమ్ సిమెంట్స్ వేపలమాదరం మైన్స్ కోసం మరో 40 ఎకరాల భూమినీ ప్రభు త్వం నుండి లీజుకు తీసుకుంది.
మరో 80 ఎకరాల మేర మిగులు భూమి ప్రభుత్వం వ ద్ద ఉంది. ఈ భూమికి ఆనుకొని శివాలయం ముందు గల పట్టా భూమి నాలుగేళ్ల క్రితం ఎకరం రూ.కోటి పాతిక లక్షలు ధర పలికిం ది. ఈ భూమి మేళ్లచెరువులోని అత్యంత ఖ రీదైన భూమి. ఈ భూమిని కబ్జా చేసేందుకు గత కొన్నాళ్లుగా ఓ గ్యాంగ్ ప్రయత్నం చే స్తుందని స్థానికంగా పెద్ద చర్చ జరుగుతుంది.
నాడు ఆక్రమించిన భూమిలో మెగాపల్లె ప్రకృతి వనం :
శివాలయం వెనుక వేపల మాదారం రో డ్డులో గల ఈ భూమిని దక్కించుకునేందుకు గత కొన్నాళ్లుగా ఓ ఇద్దరు వ్యక్తులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. 2020లో దాదాపు 20 ఎకరాల భూమిని కబ్జా చేసి, కోటి రూపాయల మేర ఖర్చుతో మట్టితోలి, పలువురు రైతులకు కౌలుకు ఇచ్చారు. రైతులు సైతం ఈ భూమిలో పత్తి పంట సాగు చేశారు. ఈ భూమిని దక్కించుకునేందుకు సదరు వ్య క్తులు జీవో నెంబర్ 59 ద్వారా రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. రూ. కో ట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందంటూ నాడు స్థానిక పత్రికల్లో పెద్ద ఎ త్తున వార్త కథనాలు రావడంతో ఆ భూమిని ప్రభుత్వం కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న భూమిని మెగా పల్లె ప్రకృతి వనంకు ఇచ్చింది.
ఐదెకరాల భూమిపై కన్ను :
పల్లె ప్రకృతి వనం పక్కన, మేళ్లచెరువు- వేపలమాదారం రోడ్డుకు ఆనుకుని ఉన్న దా దాపు 5 ఎకరాల భూమిని ప్రస్తుతం కబ్జా చే సేందుకు కుట్ర జరుగుతుంది. సిమెంట్ పరిశ్రమలో ఉన్నత పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఆదే శాల మేరకు సిద్ధం అయిన మరో వ్యక్తి తన అనుచరులతో కలిసి శుక్రవారం మధ్యా హ్నం జెసిబి తో భూమిని చదును చేయించినట్లు స్థానికుల ద్వారా తెలుస్తుంది. సిమెం ట్స్ పరిశ్రమలో ఉన్నత పదవిలో ఉన్న వ్య క్తికి చెందిన జేసీబీ చౌటపల్లి మైన్స్ నుండి వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.
ఇటీవ ల ఇక్కడ కొంత భూమిని ప్రభుత్వం ము స్లింల షాది ఖానా నిర్మాణానికి కేటాయించినట్లు పలువురు ద్వారా తెలుస్తుంది. షాది ఖానాకు కేటాయించిన భూమి పక్కనే ప్ర భుత్వ భూమిలో జేసీబీతో కంపచెట్లు తొలగించారనీ గ్రామస్తులు చెబుతున్నారు. బీఆ ర్‌ఎస్ ప్రభుత్వంలో జీవో నెంబర్ 59 ద్వారా ప్రభుత్వ భూమిని రెగ్యులర్ చేసే అవకాశం ఉండటంతో ఈ భూమిని కబ్జా చేసేందుకు ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ప్రస్తుతం ఎవరి అండదండ లతో ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు సిమెంట్ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ప్రయ త్నం చేస్తున్నారో తెలియాల్సి ఉంది. ఇటీవల ఈ భూమి జోలికి రావద్దంటూ కొందరు అ ధికారులకు,స్థానిక విలేకరులకు తాయిలాలు అందజేసినట్లు స్థానికంగా జోరుగా ప్రచా రం సాగుతుంది. ఉన్నతాధికారులు స్పందిం చి ఈ కబ్జాకోరుల ఆగడాలకు అడ్డుకట్ట వే యాలని స్థానికులు కోరుతున్నారు.






