3 August, 2026 | 2:48 AM

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

03-08-2026 01:42 AM

చొప్పదండి ,2 ఆగస్టు (విజయ క్రాంతి) ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం చొప్పదండి గీత విద్యాలయం లో 1995-96 లో పదోతరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం పెద్దాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులను సన్మానించారు. అలాగే తమ బ్యాచ్ విద్యార్థిని బండి రాజేశ్వరి ఇటీవల డిప్యూటీ కలెక్టర్ గా నియామకం కావడంతో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.