పాక్‌లో ఆత్మాహుతి దాడి
14 మంది మృతి.. 24 మందికి పైగా గాయాలు
కబల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘటన
ఇస్లామాబాద్, ఆగస్టు 2: పాకిస్తాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం కబల్ పోలీ స్ స్టేషన్ సమీపంలో ఆత్మాహుతి దాడి చేసింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీసు సిబ్బంది, నలుగురు పౌరులతో సహా పద్నాలుగు మంది మృతిచెందారు. 24 మందికి పైగా గాయపడ్డారు. శాంతిని కోరుతూ, ఉగ్రవా దాన్ని ఖండిస్తూ ప్రదర్శనకారులు గుమిగూడిన స్వాత్ జిల్లాలోని కబల్ పట్టణం గుండా స్వాత్ శాంతి ర్యాలీ వెళుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.
అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. ఉగ్రవాద వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసనకారులు పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రదర్శన చేస్తుండగా దుండగుడు దాడి చేశాడు. ఈ దా డిలో మరణించిన వారిలో కనీసం ఐదుగురు పోలీసు అధికారులు ఉన్నారని జిల్లా పోలీస్ చీఫ్ ఒమర్ ఖాన్ తెలిపారు.
పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై భద్రతా దళాలు దర్యాప్తు చేస్తున్నాయి. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఈ బాంబు దాడిని ఖండించారు. అ యితే ఈ దాడికి ఏ బృందమూ బాధ్యత వహించలేదు. అయితే తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) పై అనుమానం పడే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం టీటీపీ మిలిటెంట్లకు ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ అధికారులు ఆరోపిస్తున్నారు.






