8 April, 2026 | 8:29 AM

షేక్ ఆడించిన అభిషేక్

01-12-2025 01:27 AM

హైదరాబాద్, నవంబర్ 30 : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు.  12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన అభిషేక్ ఓవరాల్‌గా 52 బంతుల్లో 148 పరుగులు చేశాడు. అతని సునామీ ఇన్నింగ్స్ 8 ఫోర్లు, ఏకంగా 16 సిక్సర్లున్నాయి. అభిషేక్‌కు తోడు ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (70) రమణ్‌దీప్(39) మెరుపులు మెరిపించారు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 310 పరుగుల భారీస్కోర్ సాధించింది.