8 April, 2026 | 10:27 AM

ట్రీసా జోడీదే టైటిల్

01-12-2025 01:28 AM

లక్నో, నవంబర్ 30 : సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ట్రీసా జాలీ గోపీచంద్ జోడీ మ హిళల డబుల్స్ టైటిల్  నిలబెట్టుకుంది. ఈ టోర్నీ ఆరంభం నుంచీ అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్న గాయత్రి జోడీ ఫైనల్స్‌లో జపాన్‌కు చెంది న కాహో ఒసావా జోడీపై 17 21 21 15 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

తొలి గేమ్ కోల్పోయిన భారత జం ట తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. ప్రత్యర్థి జోడీపై తీవ్ర ఒత్తిడిలో పైచేయి సాధించి వరుస సెట్లలో టైటిల్ గెలుచుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత్‌కు నిరాశే మిగిలింది. టైటిల్ గెలుస్తాడనుకున్న తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ తుది మెట్టుపై చతికిలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో శ్రీకాంత్ 16 స్కోర్‌తో జపాన్‌కు చెందిన జాసన్ గునావన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.