లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్‌

17-09-2026 | 06:24am

కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు

ఎస్ఐ, ఇన్స్పెక్టర్ అరెస్ట్

కీసరమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్(Keesara Police Station)లో ఏసీబీ సోదాలు చేసింది. రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్ ఆంజనేయులు ఏసీబీకి చిక్కారు. ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి,ఆంజనేయులును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు ఇన్ స్పెక్టర్ రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. కీసర చెరువు వద్ద కారులో ఎస్ఐ రూ. 5 లక్షలు లంచం తీసుకున్నాడు. ఏసీబీ అధికారులను చూసిన ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి అక్కడినుంచి పరుగులు పెట్టాడు. 

ఏసీబీ అధికారులకు ముప్పుతిప్పలు

కెమికల్ టెస్టులు చేయించుకోకుండా ఎస్ఐ ఏసీబీ(Anti-Corruption Bureau) అధికారులను ముప్పుతిప్పలు పెట్టినట్లు సమాచారం. లంచం డిమాండ్ చేసిన ఇన్ స్పెక్టర్ ఆంజనేయులు నిందితుడితో పనిచేయించుకున్నాడు. కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్ డ్రింక్స్ తీసుకురావాలంటూ సీఐ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలున్నాయి. వేధింపులు తట్టుకోలేక బాధితుడు ఏసీబీకీ సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి కీసర చెరువు వద్ద నిమజ్జనం డ్యూటీలో లంచం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. డీఎస్పీ మాజీద్ ఆలీఖాన్ ఆధ్వర్యంలో ఏసీబీ సోదాలు చేపట్టింది.

మరిన్ని వార్తలు