12-08-2025 12:05:21 AM
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ఆగస్టు 13
గాంధారి, ఆగస్టు 11 : వ్యవసాయ భూమిని నూతనంగా పట్టా చేసుకున్నటువంటి రైతులు రైతు బీమా నమోదు కోరుకు నామిని పేరులో మార్పు కొరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గాంధారి మండల వ్యవసాయ అధికారి రాజలింగం అన్నారు.
సోమవారం ఆయన మాట్లాడుతూ జూన్ 5వ తేదీ 2025 నాటికి వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని అయి పట్టా పాస్ పుస్తకము కలిగి ఉండి లేదా తాసిల్దార్ గారి చే డిజిటల్ సంతకం చేసినటువంటి కాపీ ఉన్నవారు అదేవిధంగా ఇప్పటివరకు అనగా (18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల) వరకు రైతు బీమా చేసుకొని వారు ఉన్నట్లయితే వారు కూడా వెంటనే తమ పట్టా పాసు పుస్తకం పుస్తకము, ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డులను రైతు వేదికలలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు అందజేయాలని అయన సూచించారు.
రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలి...
సదాశివనగర్, ఆగస్టు 11 : నూతనంగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి తెలిపారు. ఈనెల 13వ తేదీ లోపు క్లస్టర్ల వారిగా వ్యవసాయ విస్తీర్ణ అధికారుల వద్ద అందుబాటులో ఉంటారని, దరఖాస్తు ఫారం పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్,నామిని ఆధార్ జిరాక్స్ తీసుకువచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.