4 August, 2026 | 1:49 AM

ఓటరు జాబితా డిజిటలైజేషన్‌లో ఖచ్చితత్వం పాటించాలి

04-08-2026 12:00 AM

గద్వాల, ఆగస్టు 3: ఓటరు జాబితా డిజిటలైజేషన్ను నాణ్యతతో, పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. బీఎల్వో యాప్లో ఓటర్ల వివరాలు, ఫొటోలను తప్పులు లేకుండా నమోదు చేయాలని, మృతి చెందిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అలాగే డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా 100 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.