సమగ్ర యువజన విధానం రూపొందించాలి
ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్
సంస్థాన్ నారాయణపూర్, ఆగస్టు 3 : అఖిల భారత యువజన సమాఖ్య మండల సమితి సమావేశం నారాయణపురం మండ ల కేంద్రంలో గడ్డం యాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతుందని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్ర భుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉ ద్యోగాలను భర్తీ చేయాలనీ, యువతకు స మగ్ర ఉద్యోగ ,ఉపాధి విధానం రూపొందించాలని అన్నారు. యూత్ పాలసీని తీసుకొ చ్చి యువతకు నైపుణ్యత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరు వెంకటేష్, కొండూరి రవితేజ, సింగపంగ రమేష్, కొత్త శేఖర్, కొర్ర వినోద్, కేలోతు కిషన్ నాయక్, కొండూరు నవీన్, చరణ్, హరి, ప్రభాకర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.






