16 July, 2026 | 5:49 PM

పోక్సో కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష

16-07-2026 05:49 PM

సిద్దిపేట క్రైం: మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో తాడేం చందు(34) అనే నిందితుడికి న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధించినట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. 2022 మే 20న నమోదైన ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి సిద్దిపేట ఏసీపీ  దేవరెడ్డి సమగ్ర దర్యాప్తు నిర్వహించి, ఛార్జిషీట్‌ను న్యాయస్థానంలో దాఖలు చేశారని పేర్కొన్నారు. సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు పరిశీలించిన  అనంతరం నిందితుడిని దోషిగా నిర్ధారించి న్యాయమూర్తి వై.జయప్రసాద్ తుది తీర్పు వెలువరించారని సీపీ తెలిపారు. నిందితుడికి శిక్ష పడడంలో కృషి చేసిన అధికారులను, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.