16 July, 2026 | 2:59 PM

డాక్టరేట్ అందుకున్న యు.రవికుమార్‌కు ఘన సన్మాన

16-07-2026 02:58 PM

భైంసా,(విజయక్రాంతి): ​భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న యు. రవికుమార్ ఇటీవల 'పీహెచ్‌డీ' పట్టా పొందారు. 'డిగ్రీ స్థాయి విద్యార్థుల ఆంగ్ల భాష అభ్యసనంలో మాతృభాష ప్రభావం' అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గాను స్వామి రామానంద తీర్థ విశ్వవిద్యాలయం ఈ గౌరవాన్ని అందించింది.

​ఈ సందర్భంగా, రవికుమార్ పూర్వ విద్యార్థిగా చదువుకోవడమే కాకుండా, గతంలో ఇదే నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, కళాశాల వేదికగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఒకప్పుడు విద్యార్థిగా, ఆపై అధ్యాపకునిగా ఈ కళాశాల అభివృద్ధిలో భాగస్వామి అయిన రవికుమార్ డాక్టరేట్ సాధించడం పట్ల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సుధాకర్, అధ్యాపక బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.