6 May, 2026 | 11:06 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

జడ్డీపై చెప్పు విసిరిన నిందితుడు

13-02-2025 02:04 PM

ఎల్బీనగర్ జిల్లా కోర్టులో కలకలం 

ఎల్బీనగర్: ఎల్బీనగర్ జిల్లా కోర్టులో కేసు విచారణ సందర్భంగా ఒక నిందితుడు గురువారం న్యాయమూర్తిపై చెప్పు విసిరిన ఘటన కలకలం రేపింది. బుధవారం ఓ కేసులో జీవిత ఖైదీ శిక్ష పడిన నిందితుడు గురువారం ఇంకో కేసు విషయంపై రంగారెడ్డి జిల్లా కోర్టుకు వచ్చాడు. జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా  న్యాయమూర్తిపై చెప్పు విసిరాడు.  జడ్జి దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేసి  దాడికి ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమై దూరంగా తీసుకపోవడంతో ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.