30 July, 2026 | 7:01 PM

రంగపేట పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణి

30-07-2026 05:54 PM

మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామ సర్పంచ్ కొత్త రాంరెడ్డి - రజిత దంపతుల కుమారుడు కొత్త అజిత్ రెడ్డి 28వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రంగపేట ప్రభుత్వ పాఠశాలలో 37గురు విద్యార్థులకు గురువారం  సుమారు 18 వేల రూపాయల వ్యయంతో స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అజిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకు, అట్టహాసాలకు వ్యయం చేయకుండా సమాజానికి ఉపయోగపడేలా పాఠశాల పిల్లలందరికీ ఉపయోగపడేలా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.

బ్యాగులు అందుకున్న విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో పండుగ, సంతోషకరమైన వాతావరణం నెలకొన్నది. గ్రామ సర్పంచ్ కుమారుడు విదేశాలలో ఉన్నప్పటికిని సొంత గ్రామంలో చేసిన ఈ వితరణ కార్యక్రమాన్ని   ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.