calender_icon.png 15 February, 2026 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

14-02-2026 08:05:13 PM

ఏసీఎంఓ ఉద్ధవ్

వాంకిడి,(విజయక్రాంతి): పదవ తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏసీఎంఓ ఉద్ధవ్ కోరారు. శనివారం వాంకిడిలోని ఆశ్రమ పాఠశాల బాలికల వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థినులకు మోటివేషనల్ స్పీకర్ సుందిలా రమేష్ ద్వారా ప్రోత్సాహక (మోటివేషన్) తరగతులు నిర్వహించారు.

ఏసీఎంఓ ఉద్ధవ్ మాట్లాడుతూ... విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమబద్ధమైన అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే సబ్జెక్ట్ నిపుణులచే పదవ తరగతి విద్యార్థులకు ప్రశ్నాపత్రం విధానం, సులభంగా ఉత్తీర్ణత సాధించే మార్గాలు, అత్యధిక మార్కులు ఎలా సాధించాలనే అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ ఏం. నారాయణ మూర్తి, వసతి గృహ సంక్షేమ అధికారి మంగవతి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.