calender_icon.png 14 February, 2026 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్‌లో ఘనంగా జిల్లా స్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలు

14-02-2026 08:01:43 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడా పోటీలు శనివారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జిల్లా డివైస్ ఓ అక్కపాక సురేష్ మున్సిపల్ కమిషనర్ రమేష్, మండల విద్యాశాఖ అధికారి ఆరెపల్లి రాజయ్య, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత శారీరకంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సీఎం కప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రతిభకు మంచి వేదిక లభిస్తోందని పేర్కొన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని తెలిపారు. అథ్లెటిక్స్ లో 100 మీటర్, 200 మీటర్, లాంగ్ జంప్, వివిధ కేటగిరీలలో పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పేట బాధ్యులు శోభారాణి, పెద్దపల్లి జిల్లా పేట అధ్యక్ష కార్యదర్శులు దాసరి రమేష్, వేల్పుల సురేందర్, మండల ఎస్జిఎఫ్ కార్యదర్శి తాండ్ర ప్రణయ్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్, శ్రీవాణి, సరోజ, వెంకటేష్, విష్ణు, జావిద్, మాధవి, వెంకటేష్, అజయ్, కుమార్,రాజేందర్, సత్యం, విద్యార్థులు పాల్గొన్నారు.