21 June, 2026 | 1:15 AM

అనుమతి లేని ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి

21-06-2026 12:24 AM
  1. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ 
  2. ట్రినిటీ విద్యాసంస్థ పుస్తకాల దందాను సీజ్ చేసిన విద్యాధికారులు

చౌటుప్పల్, జూన్20(విజయక్రాంతి): చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో విచ్చలవి డిగా పర్మిషన్ లేకుండా స్కూలు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్న విద్యాసంస్థలను సీజ్ చేయాలని బీసీ సంఘం నాయకులు కోరారు.చౌటుప్పల్ పట్టణంలో ఉన్న ట్రినిటీ విద్యాసంస్థలు ఒక స్కూలుకు పరిమిషన్ ఉంటే మూడు స్కూళ్లు నడుపుతు న్నారని, పర్మిషన్ లేకుండా క్లాసులు నిర్వహి స్తున్నారని వారు ఆరోపించారు.

యథేచ్ఛగా విద్యార్థులకు బయట దొరికే రేట్ల కంటే దాదా పు మూడు రెట్లు అధిక ధరలకు పుస్తకాలు, స్టేషనరీ,డ్రెస్సులు  అమ్ముతున్నారని, ట్రినిటీ విద్యాసంస్థ యాజమాన్యాన్ని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తే మా ఇష్టాను సారంగా స్కూళ్లను నడుపుతామని.. అడగ డానికి మీరేవరిని సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు.

ఈ విషయమై డీఈవోకు బీసీ సంఘం నాయకులు విషయం తెలియజే యగా,మండల విద్యాధికారి గురువారావు వారి బృందాన్ని పంపి పర్మిషన్ లేని ట్రినిటీ స్కూల్‌ను, అందులో లభించిన బుక్కులను ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ మాట్లాడుతూ ప్రవేట్ విద్యాసంస్థలు పర్మిషన్ లేకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నాయన్నారు.

స్కూల్ ఫీజు అని, బస్సు,ట్యూషన్,డొనేషన్ ఫీజులు అని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను నిలువునా దోచు కుంటున్నారని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మనీల్,ఎడ్ల మహాలింగం, నిరంజన్ గౌడ్, మల్లయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.