ఓపెనింగ్ కలెక్షన్లు..కెరీర్‌లోకెల్లా బంగారం
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో ఇతర కీలక పాత్రల్లో శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ నటించారు. ఈ సినిమా జూన్ 19న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. తొలి ఆట నుంచే ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.
ముఖ్యంగా సమంత పెర్ఫార్మెన్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఆమె చేసిన ఇంటెన్స్ ఫైట్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుం టున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లలో స్ట్రాంగ్ ప్రీ సేల్స్‌లోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. మొదటి రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా రూ.13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి సమంత కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ మూవీకి వచ్చిన మంచి ఓపెనింగ్స్ ట్రేడ్ అనలిస్టులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. ఓం ప్రకాశ్ సినిమాటోగ్రాఫర్‌గా, ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా పనిచేశారు.






