హస్తినలో కలుద్దాం
22, 23న నేను ఢిల్లీలోనే ఉంటా
- అశ్వినీ వైష్ణవ్‌తో మీటింగ్ ఏర్పాటు చేయండి
- మెట్రోపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో రైల్ పెండింగ్ అంశాల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని, అందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి శని వారం మరోలేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించాలని ఆ లేఖలో కోరారు.
ఈ నెల 22, 23 తేదీల్లో తాను ఢిల్లీలో ఉంటానని, మెట్రో ఫేజ్-2, ఐఆర్‌ఎఫ్‌సీ, ఫైనాన్సింగ్‌కు సం బంధించిన అంశాలపై చర్చకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సీఎం విజ్ఞప్తి చేశారు. కాగా సీఎం ఆదివారం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ సమయంలో అశ్విని వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్‌రెడ్డిని కోరారు. ఇద్దరం కలిసి రైల్వే మంత్రిని కలుద్దామని ప్రతిపాదించారు.
మెట్రో టేకోవర్ ఐఎఫ్‌ఆర్‌సీతో రుణ ఒప్పందాలు, మెట్రో ఫేజ్2 సంబంధిత ప్రతిపా దనల ప్రతులతో సమావేశానికి తాను హాజరవుతానని లేఖలో ప్రస్తావించారు. సమా వేశం ఏర్పాటు చేసి తనకు సమాచారం ఇవ్వాలని లేఖలో కిషన్‌రెడ్డిని కోరారు. కాగా, ఈ నెల 16న కూడా హైదరాబాద్ మెట్రో రై లు అంశంపై కిషన్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి ఈ నెల 13న లేఖ రాశారు. సింగరేణిలో 40 లక్ష ల టన్నుల బొగ్గు మాయమైందని, దానిపై విచారణ జరిపించాలని ఆయన కోరారు.






