అటవీ,రెవెన్యూ భూ వివాదాల పరిష్కారానికి కార్యాచరణ
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి,జూన్23 (విజయ క్రాంతి) జిల్లాలో అటవీ, రెవెన్యూ భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్ కొప్పుల వెంకట్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లోని ఇసుక రీచ్ల నుంచి ఇసుక రవా ణా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే జరగాలని సూచించారు.
ఇసుక తవ్వకాల అనుమతులకు సంబంధించి రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సంయుక్త సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమైన అటవీ భూములకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 30లోగా సమర్పించాలని సూచించారు. సమావేశంలో పెద్దపల్లి ఆర్డీవో బీ గంగయ్య, ఇన్చార్జి డీఎఫ్వో నవీన్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు






