24 June, 2026 | 2:09 AM

పాఠశాలల బంద్ విజయవంతం

24-06-2026 01:17 AM

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు 

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్రచేస్తూ.. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విచ్చలవిడి ఆర్థిక దోపిడీకి కొమ్ము కాస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఏబీ వీపీ చేపట్టిన పాఠశాలల బంద్ విజయవంతమయ్యిందని ఏబీవీపీ రాష్ట్ర కార్య దర్శి మాచెర్ల రాంబాబు మంగళవారం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో పేద పిల్లలకు విద్యను దూరం చేయడం కోసమే 23 వేల పాఠశాలలను మూసివేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు.

ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్న ఆయా యాజమాన్యాలపై చర్యలు లేవని, ఫీజుల నియంత్రణ చట్టం హామీ గాలికొదిలేశారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల భూము లను కాజేసేందుకే రేషనలైజేషన్ పేరు తో ప్రభుత్వ బడులను మూస్తున్నారా? అనే అనుమానం కలుగుతుందన్నారు.

పాఠశాలలు తెరిచి వారం అవుతున్నా విద్యార్థులకు యూనిఫామ్స్ అందలేదంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ఇట్టే అర్థమవుతుందని మండిపడ్డారు. బంద్‌కు తల్లిదండ్రులు, విద్యార్థులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులు బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న సందర్భంలో కొంతమంది పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. 

స్వచ్ఛందంగా బంద్ పాటించిన ప్రైవేట్ స్కూళ్లు..

ఏబీవీపీ బంద్‌ను ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా పాటించాయి. దా దాపు మండలం, జిల్లా, పట్టణ కేంద్రాల్లోని పాఠశాలలకు ముందే యాజ మాన్యాలు సెలవును ప్రకటించాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం పాఠశాలలు నడిచాయి. ఇక ప్రభుత్వ పాఠశాలలను ఏబీవీపీ కార్యకర్తలు దగ్గరుండి మూ యించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని లోక్‌భవన్ పాఠశాలను బంద్ చేయించేందుకు వెళ్లిన రాష్ట్ర కార్యదర్శి రాంబాబును, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.