7 July, 2026 | 10:59 PM

టీజీ న్యాబ్‌తో కలిసి డ్రగ్స్ నియంత్రణకు చర్యలు

31-08-2024 01:16 AM

ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్  కమలాసన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్, టీజీన్యాబ్ ఆధ్వర్యలో సంయుక్త దాడులు నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీ.బీ కమలాసన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో.. టీజీన్యాబ్ ఎస్పీలు చైతన్య, సీతారామ్‌లు పాల్గొని డ్రగ్స్ తనిఖీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్సైజ్ అధికారులకు పలు సూచనలు చేశారు.