డెక్కన్ సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం శాత్తు కార్మికుడు మృతి
07-07-2026 09:12 PM
పాలకవీడు: మండలంలోని డెక్కన్ సిమెంట్ పరిశ్రమలో లైన్ -2 లోని ఫ్రీ హీటర్ టాప్ లో పైన కిలణ్ ఫీడ్ బకెట్ ఎలివేటర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు సోమవారం రాత్రి 9 గంటల ఆ సమయంలో జి ఎన్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్కు రేవూరి గ్రామానికి చెందిన గోపి దగ్గర పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన భూతం వెంకట్రావు 45 తండ్రి నారాయణ అనే వ్యక్తి కి కప్లింగ్ తలకు తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చేసినట్టు ఎస్ ఐ కోటేష్ తెలిపారు. మృతుని భార్య భూతం పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామున్నారు.






