అక్రమంగా పటిక, బెల్లం అమ్మితే చర్యలు
24-06-2025 12:23 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): అనుమతులు లేకుం డా పటిక, బెల్లం విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ రవి అన్నారు. సోమవారం కౌటాల మండలం ము త్యంపేట గ్రామంలో కిరాణా షాపుల లో దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీకి వినియోగించే 160 కిలోల బెల్లం, 80 కిలోల పటికను స్వాధీనం చేశారు.
అనుమతులు లేకుండా విక్రయిస్తున్న ప్రవీణ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నాటు సారా, గుడుంబా తయారు చేసే వారిని, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.






