26 April, 2026 | 8:47 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

డిమాండ్ల సాధన కోసం కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగుల జేఏసీ

22-10-2024 06:39 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): డిమాండ్ల సాధన కోసం కార్యాచరణను ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. పెండింగ్ డీఏలు, బిల్లులు విడుదల చేయాలని, కొత్త పీఆర్సీ సిఫార్సులు అమలు చేయాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఈనెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారిలకు జేఏసీ కార్యాచరణ లేఖ ఇవ్వనున్నారు. నవంబర్ 2న కలెక్టర్లు, 4,5 తేదీల్లో ప్రజాప్రతినిధులకు లేఖలు ఇవ్వనున్న ఉద్యోగులు నవంబర్ 7 నుంచి డిసెంబర్ 27 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించనుంది. జనవరి 3,4న నల్లబ్యాడ్జీలతో విధులు, భోజన విరామంలో నిరసనలు, జనవరి 23న రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు, జనవరి 30న రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.