17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

‘మోగ్లీ 2025’లో బండి సరోజ్ లుక్ ఇదే!

31-03-2025 10:18 PM

యంగ్ హీరో రోషన్ కనకాల ప్రస్తుతం ‘మోగ్లీ 2025’లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ‘కలర్‌ఫోటో’ డైరెక్టర్ సందీప్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో నటుడు బండి సరోజ్‌కుమార్ ఓ పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్రను ‘నోలన్’గా పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సరోజ్ క్యాండిల్‌తో సిగరెట్ వెలిగిస్తూ ఇంటెన్స్‌గా చూస్తూ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంత బలంగా ఉండబోతోందో ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ సంవత్సరం చివర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: రామ మారుతి ఎం; 

సంగీతం: కాలభైరవ; ఎడిటర్: కోదాటి పవన్‌కళ్యాణ్; ఆర్ట్: కిరణ్ మామిడి; యాక్షన్: నటరాజ్ మాడిగొండ.