15 July, 2026 | 12:38 AM

‘సర్’ పక్కాగా నిర్వహించాలి

15-07-2026 12:37 AM

ఎంపీ ఆల్కాసింగ్ గుజ్జర్

ఎల్బీనగర్, జులై 14: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, బీఎల్వోలు సమగ్ర ఓటరు నమోదు సవరణ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ’ఎస్‌ఐఆర్’ ఇన్చార్జ్, రాజ్యసభ సభ్యురాలు ఆల్కాసింగ్ గుజ్జర్ సూచించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బీజేపీ లింగోజిగూడ డివిజన్ అధ్యక్షుడు గుండె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ను పరిశీలించారు.

ఈ సందర్భంగా హెల్ప్ డెస్క్ పనితీరు, ఓటరు నమోదు ప్రక్రియ, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆమె సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేలా కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, జోన్ ఇన్చార్జ్ మర్రి శశిధర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, జిల్లా ఇన్చార్జ్ చెన్నకేశవ రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం బీఎల్‌ఏ శ్రీ బండారు భాస్కర్,  నాయకులు ఆకుల అఖిల్ గౌడ్, బోస్లె శ్రీనివాస్ రావు,  జగదీష్,  సురేష్ కిరణ్,  గౌతమ్ గుప్తా,  శ్రీకాంత్,  రాహుల్ తదితరులు పాల్గొన్నారు.