12 June, 2026 | 1:15 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •  

నటి రన్యారావుకు చుక్కెదురు

27-02-2026 01:00 AM

రూ. 102 కోట్ల గోల్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా గుర్తింపు

బెంగళూరు, ఫిబ్రవరి 26: దుబాయ్ నుం చి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ అడ్డంగా పట్టుబడిన కన్నడ నటి రన్యారావు కేసులో డీఆర్‌ఐ కీలక ముందడుగు వేసింది. కమిషన్ల కోసం కక్కుర్తి పడి విమానాశ్రయంలో అక్రమంగా 14 కిలోల బంగారం తరలిస్తూ పట్టుబడ్డ ఆమె చేసిన స్మగ్లింగ్‌లో.. ఇది ఒక చిన్న భాగం మాత్రమేనని అధికారులు గుర్తించారు. ఏడాది కాలంలో ఏకంగా 127 కిలోల బంగారాన్ని ఈ ముఠా అక్రమంగా తరలించిందని ఈడీ విచారణలో తేలింది.

మొన్నటి వరకు వెండితెరపై మెరిసిన కన్నడ నటి రన్యారావు ఇప్పుడు కటకటాల వెనుక స్మగ్లింగ్ రాణి గా నరకం చూస్తోంది. ముఖ్యంగా ఆమెకు సంబంధించి సంచలనం సృష్టించిన రూ. 102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసులో ఈడీ కీలక ముందడుగు వేసింది. ఈ భారీ స్మగ్లింగ్ సిండికేట్‌లో రన్యారావు పాత్రపై పక్కా ఆధారాలతో బెంగళూరులోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రధాన నిందితురాలుగా ఈమె పేరును చేర్చడం గమనార్హం.

ఏడాదిలో 127 కిలోల బంగారం..  

రన్యారావు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి సవతి కుమార్తె కావడం గమనార్హం. గత ఏడాది బెంగళూరు విమానాశ్రయంలో ఆమె పట్టుబడటంతో ఈ భారీ స్కామ్ బయట పడింది. కేవలం 15 రోజుల వ్యవధిలో ఆమె నాలుగు సార్లు దుబాయ్ పర్యటించడం అధికారుల్లో అనుమానం రేకెత్తించింది. విమానా శ్రయం ఎగ్జిట్ గేట్ వద్దకు చేరుకున్న తరుణం లో రెవెన్యూ అధికారులు ఆమెను అడ్డుకుని తనిఖీ చేయగా.. ఏకంగా 14.2 కిలోల బంగారం బయటపడింది. ఇందులో కొంత ఆమె ఒంటిపై ఆభరణాల రూపంలో ఉండగా.. మరికొంత దుస్తుల్లో దాచి ఉంచింది.