25 February, 2026 | 3:29 AM

తొలగనున్న అదనపు డంపింగ్ భారం

25-02-2026 12:12 AM

మినీ డంపింగ్ యార్డుల కోసం ప్రభుత్వం వేట

జవహర్‌నగర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): గ్రేటర్ మున్సిపాలిటీల విలీనం చివరకు జవహర్ నగర్ పాలిట శాపంగా పరిగణించింది. హైదరాబాద్ సిటీ నుండి రోజుకు దాదాపుగా 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు చేరుతుండగా... కొత్త ప్రాంతాల నుండి వస్తున్న 1500 టన్నుల అదనపు భారంఈ జవహర్‌నగర్‌ను ఊపిరి తీసుకోనివ్వడం లేదని జవహర్‌నగర్ వాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నరకం నుండి జవహర్‌నగర్ వాసులకే కాకుండా చుట్టుపక్కల ప్రాం తాలైన దమ్మాయిగూడ, నాగారం, అహమ్మద్ గూడా, చీర్యాల్, తదితర ప్రాంతాల ప్రజలకు విముక్తి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం వికేంద్రీకరణ బాట పట్టింది. శివారు ప్రాంతాల్లో కొత్త డంపింగ్ యార్డ్ ల కోసం వేట మొదలు పెట్టింది.