ఉగాది నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి
రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్
సూర్యాపేట, పిబ్రవరి 24 (విజయక్రాంతి): జిల్లాలో ఉగాది నాటికి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి వి పి గౌతమ్ అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్లపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్లాబ్ దశలో, సగం వరకు పూర్తయిన 2700 ఇందిరమ్మ ఇండ్లను పూర్తిచేసి ఉగాది నాటికీ లబ్ధిదారులకు అందించే విధంగా సిద్ధం చేయాలని సూచించారు. అదేవిదంగా పూర్తయిన ఇండ్లకు డబ్బులు చెల్లించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో పెండింగ్ పనులైన అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటి, డ్రింకింగ్ వాటర్ మొదలైన పనులను పూర్తిచేయాలన్నారు.
అనంతరం గుంపుల, సూర్యాపేట మండలంలోని కేసారంలో గల ఫేస్-I, ఫేస్-II ఇందిరమ్మ ఇండ్ల బ్లాకులను హౌసింగ్ ఎండి గౌతమ్, కలెక్టర్ తో కలిసి సందర్శించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, సూర్యాపేట తాసిల్దార్ కృష్ణయ్య, హౌసింగ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.




