ఎంఐఎం నుంచి టీఆర్పీలో చేరికలు
- 80 మంది అనుచరులతో చేరిన అమీర్ ఖాన్
- ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ (MIM MLA Akbaruddin) ఓవైసీ అనుచరుడిగా గుర్తింపు పొందిన అమీర్‌ఖాన్ తన 80 మంది అనుచరులతో కలి సి ఆదివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో (Telangana Rajyadhikari Party) చేరారు. టీఆర్పీ స్టేట్ మైనారిటీ ప్రెసిడెంట్ స ల్మాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స మక్షంలో అమీర్ ఖాన్ చేరారు.
ఈ సందర్భంగా అమీర్ ఖాన్‌ను టీఆర్పీ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మైనారిటీ యూత్ ప్రెసిడెంట్‌గా నియమి స్తూ తీన్మార్ మల్లన్న నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మైనా రిటీ యువతను టీఆర్పీ సిద్ధాంతాల వైపు తీసుకువెళ్లాలని ఆయనకు సూచించారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో మైనారిటీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాన వాటా కల్పించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
కార్యక్ర మంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గంగాధర్ లింగాల, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్స య్య గౌడ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, కార్మిక విభాగం అధ్యక్షుడు సంకూరి శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్,రాష్ట్ర కార్యదర్శి కొమ్మల ప్రవీణ్ రాజ్, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చింటూ,
ప్రధాన కార్యదర్శి వీరమల్లు అనిల్, సహాయ కార్యదర్శి గిరిగాను బిక్షపతి గౌడ్, స్టేట్ ఆఫీస్ కోఆర్డినేటర్ లింగం యాదవ్, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు మున్నూరు జయపాల్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఎండి గౌస్ పాషా, మైనారిటీ విభాగ నాయకులు, కార్యకర్తలు మరియు అమీర్ ఖాన్, ఆయన అనుచరులు పాల్గొన్నారు.