బిజెపి ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యదర్శిగా అడిచెర్ల రాజు
ముకరంపుర,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన అడిచెర్ల రాజు నియమితులయ్యారు. ఈ మేరకు బిజెపి తెలంగాణ రాష్ట్ర పార్టీ నియామకపు ఉత్తర్వుల ప్రకటన విడుదల చేసింది. ఓబిసి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన అడిచెర్ల రాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యదర్శి ఆఫీస్ బేరర్ గా అవకాశం కల్పించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి లతోపాటు నా నియామకానికి సహకరించిన కరీంనగర్ జిల్లా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు మిత్రులు శ్రేయోభిలాషులు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ కోసం , ఓబీసీ మోర్చా బలోపేతం కోసం తన వంతు శాయ శక్తుల కృషి చేస్తానని తెలిపారు.






