29 August, 2026 | 6:26 PM

ఇంద్రవెల్లి సాక్షిగా తుడుందెబ్బ యుద్ధం మొదలు

29-08-2026 05:56 PM

రాష్ట్ర వ్యాప్త  ఐటీడీఏ  కేంద్రాలలో ఆదివాసీ మార్చ్ కి వేలాదిగా కదిలి రండి

తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా.అరుణ్ కుమార్

వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్క బాబురావుల పిలుపు

ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదివాసీ పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ కేంద్రాలలో బారి "ఆదివాసి మార్చ్" కార్యక్రమని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మహిపతి అరుణ్  కుమార్, రాష్ట్ర కార్యవర్గ నిర్వాహక అధ్యక్షుడు పుర్కా బాపూరావులు అన్నారు. శనివారం అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గిరిజన అమరుల స్థూపం ప్రాంగణంలో రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏలో  చేపట్టే "ఆదివాసి మార్చ్"  కరపత్రాలు, గోడ పుత్రులను విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... సెప్టెంబర్ నెలలో వివిధ ఐటిడిఏ కేంద్రాలలో నిర్వహించే ఆదివాసి మార్చ్ తేదీలను ప్రకటించారు. సెప్టెంబర్-7  ఏటూరు నాగారం, సెప్టెంబర్-16 ఉట్నూర్, సెప్టెంబర్-21 భద్రాచలం, సెప్టెంబర్-28 మన్ననూరు, ఐటిడిఎ కేంద్రాలలో ఆదివాసి మార్చ్ ల నిర్వహణ చేయనున్నట్లు తుడుందెబ్బ తెలిపింది. ఈ కార్య క్రమం లో రాష్ట్ర అధ్యక్షులు డా.మైపతి అరుణ్ కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధబోయిన లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షులు పెందూరూ దాధిరావ్ రగల్ జెండా చైర్మన్ మెస్రం నాగ్ నాథ్ ప్రధాన కార్యదర్శి పురక చిత్రులు  హాజరయినారు.

అనంతరం  డా.అరుణ్ కుమార్ మాట్లాడుతూ..రాష్ట్రం లో ఆదివాసీల మనుగడ దిన దిన గండంగా మారింది అని ఎన్ని ర్యాలీ లు బహిరంగ సభ లు నిర్వహణ చేసి ఆదివాసీల సమస్యలను విన్నవించినా, రాష్ట్ర ప్రభుత్వం  పై దున్న పోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తుంది అన్నారు. అందుకే పోరాటాలు ఉధృతం చేయటం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు కు పిలుపు ఇచ్చాం అన్నారు. 1976 నుండి 2026 వరకు 50 ఏళ్లుగా ఆదివాసీల రిజర్వేషన్ లను దోచుకుంటున్న లంబాడి లను ఎస్టీ ల నుండి తొలగించటం కోసం ప్రత్యేక కమిషన్ ను నియమించాలి.

"5" వ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల  లో 29 శాఖల జీవోలను ట్రైబల్ అడ్వసరి కమిటీ (TAC ) తీర్మానం ద్వారా ప్రత్యేక చట్టం చేయాలని, ఐటీడీఏ ద్వార నే ఉద్యోగ బర్తీ ప్రక్రియ ప్రమోషన్ లు బదిలీలు చేయాలనీ కానిస్టేబుల్ ఉద్యోగాలలో 75 పర్సంట్ వాట ఏజెన్సీ DSC ఏర్పాటు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి గిరి వికాస్ బోర్లు దింపాలనీ గోదావరి నది పై కట్టిన ప్రాజెక్ట్ లలో తుపాకుల గూడెం దేవాదుల కాళేశ్వరం నుండి  ఆదివాసీ ప్రాంత రైతులకు సాగు నీరు ఇవ్వాలని BTPS,KTPS,BPL, దేవపూర్ సిమెంట్ ప్యాక్టరీలో  సింగరేణి లలో అధివాసిల వాట, ఉద్యోగాల వాట, తదితర డిమాండ్ లతో ఈ మార్చ్ ల నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ASU  కార్య నిర్వాహక అధ్యక్షులు కనక గణేష్,తుడుం దెబ్బ ఉపాధ్యక్షులు మెస్రం జైరాం, విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు గేడం  లాలు ప్రసాద్, తుడుం దెబ్బ మండలం కార్యనిర్వాహనా అధ్యక్షులు కుర్సెంగ రాందాస్, తుడుం దెబ్బ మండల ప్రదాన అధ్యక్షులు మెస్రం సందీప్,పెందుర్ క్రిష్ణ,పూర్క నగేష్, మెస్రం మోతిరం కనక రాందాస్ గేడం నరేష్ తదితరులు పాల్గొన్నారు.