8 May, 2026 | 4:46 PM

నడిరోడ్డుపై ప్రసవించిన ఆదివాసీ మహిళ

17-09-2025 12:12 AM
  1. ప్రసవ వేదన ధారంతా బురద మయం
  2. డోలి కట్టి కష్టంగా ఆసుపత్రికి ప్రయాణం 
  3. ఏజెన్సీ వాసుల తలరాతలు మారని పరిస్థితి
  4. ప్రధాన రహదారుల పరిస్థితి మరీ ఘోరం
  5. మా గ్రామం మా అడవి ఐనా మాకు మార్గం లేదు 

చర్ల, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని అటవీ గ్రామం అయిన బట్టిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి మహిళ రవ్వ భీ మేకు పురిటి నొప్పులు రావడంతో, రహదారి మార్గమంతా బురదమయం కావడం తో అంబులెన్స్ కాస్త ఆలస్యం అవటం వచ్చే మార్గం సరిగా లేకపోవడంతో, డోలిలో కట్టి గర్భిణీ స్త్రీని తరలించేందుకు పది మంది నానా తంటాలు పడ్డారు.

బుదరలో సుమా రు నాలుగు కిలోమీటర్ల దూరం మోసుకోస్తుండగా ప్రసవ వేదనతో నొప్పులు ఎక్కువై తిప్పాపురం నడిరోడ్డుపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్ కాస్త ఆలస్యం అ వటం తో రవ్వ భీమే నుఅక్కడి నుంచి ఆ టోలో తీసుకెళ్తుండగా మార్గం మధ్యంలో అంబులెన్స్ ఎదురు రావడంతో సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు.

ఈ విషయమై రవ్వ భేమే భర్త రవ్వ ఇ డుమ మాట్లాడుతూ మా గ్రామం కి రహదారి సరిగా లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అని ప్రతి సారి వర్షా కాలం వచ్చిందంటే నరకం అనుభవిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు,  పాముకాటు , తదిత ర విష పురుగుల ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం.

ఈ విషయమై పలు మార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్న పట్టించు కోలేదని కలెక్టర్ ను కూడా కలిశామని అయినా ఫలితం లేద నీ ఆవేదన వ్యక్తం చేశారు. మా అడవి మా గ్రామం అడివిలో బ్రతికే మాకు ఎందుకు అ డవి శాఖ అధికారులు రహదారి అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించా డు. వైద్య పరీక్షలు చేసి జన్మించిన పండింటి బాబు, తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని స త్యనారాయణపురం డాక్టర్ తెలియచేశారు.

ఏజెన్సీ రహదారులన్నీ ఘోరం 

చర్ల మండలంలోని ప్రధాన రహదారులన్నీ ఘోరం గా మారాయి అధిక లోడుతో ఇసుక లారీల రద్దీ పెరగడం తో రహదారులన్నీ గుంతల మయం. ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల గ్రామాలన్నీ రాకపోకలకు వర్షాకాలం వచ్చిందంటే తీవ్రత అంతరాయం కలుగుతుంది, ఆదివాసీలకు ఈ రహదారి యమగండం గా మారుతోంది. ప్రయాణికు లు ఇబ్బందులు పడుతున్న చోద్యం చూ స్తున్న అధికారులు అంటూ మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.