8 May, 2026 | 5:56 PM

ఖేడ్ నియోజకవర్గంలో దంచికొట్టిన వర్షం

17-09-2025 12:12 AM

నీట మునిగిన పంటలు 

నారాయణఖేడ్, సెప్టెంబర్ 16: నారాయణఖేడ్ నియోజకవర్గం లో సోమవారం రాత్రి నుండి భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా నియో జకవర్గంలో చెరువులు వాటి అలుగులు పొంగిపొర్లాయి. కాగా ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షం కారణంగా పంటలు నీట మునిగాయి. ఇప్పటికే పత్తి, పెసర, మిను ము , ఉల్లినారు పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నారాయణఖేడ్ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో పరిస్థితి ఇదే విధంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు కాగా ఎడతెరిపి లేని వర్షం విడువకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాలకు భారీ ఎత్తున వాగులు రావడంతో రాకపోకలు సైతం నిలిచిపోయాయి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.