17-09-2025 12:11:13 AM
జిన్నారం (పటాన్చెరు), సెప్టెంబర్ 16 :జి న్నారం మున్సిపాలిటీ ఊట్ల పరిధిలోని చెరు వు, కుంటలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని ఊట్ల మత్స్య సహకార సంఘం సభ్యులు కమిషనర్ తిరుపతిని కోరారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మత్స్యకారులు కమిషనర్ను కలిసి సన్మానించారు.
అనంతరం ఊట్ల పరిధిలో ఉన్న చెరువు, కుంటల వివరాలను వివరించారు. చేపల పెంపకంపై చాలా కుటుంబా లు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మత్స్య సహ కార సంఘం నాయకులు, ముదిరాజ్ సం ఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.