23 July, 2026 | 6:32 PM

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

23-07-2026 05:28 PM

ఏఐ వినియోగంతో పరిపాలన వేగవంతం: 

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి (విజయక్రాంతి): ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఎఐ సమర్థవంతంగా వినియోగించినప్పుడే అభివృద్ధి వేగవంతమవుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో టీ ఫైబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ ఆధారిత సాధనాల వినియోగం, డేటా విశ్లేషణ, నివేదికల తయారీ వంటి అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పనుల్లో ఏఐ వినియోగం అవసరమని, అయితే దానిపై పూర్తిగా ఆధారపడకుండా జాగ్రత్తగా ఉపయోగించాలని సూచించారు.

ఏఐ సూచనలను ధృవీకరించిన తర్వాతే అమలు చేయాలని తెలిపారు. జిల్లా అభివృద్ధికి సాంకేతికత కీలకమని పేర్కొంటూ,అన్ని శాఖల అధికారులు శిక్షణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డిఆర్వో వసంత కుమారి, ఏఐ నిపుణులు ధీరజ్, రాహుల్, ఈడీఎం శ్రీకాంత్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.