23 July, 2026 | 6:14 PM

నీట్ పేపర్ లీక్ ఘటన పై నిరసన

23-07-2026 05:21 PM

బేల మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల ధర్నా

బేల,(విజయక్రాంతి): నీట్ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం బేల మండల కేంద్రంలో  నిరసన కార్యక్రమం చేపట్టారు. లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శివాజీ చౌక్ లో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. కొద్దిసేపు ట్రాఫిక్ స్థంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రూప్ రావు, యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ... నీట్ పేపర్ లీక్ కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, మాజీ జడ్పీటీసీ రాందాస్, బేల మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు అశోక్ పటేల్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవ్ గుండవార్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, INTUC బేల మండల అధ్యక్షుడు కన్య రాజు, సుదం రెడ్డి, సర్పంచులు నాగారావ్, వినోద్, అవినాష్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మాడవి చంద్రకాంత్, ఆకాష్ గుండవర్, అఖిల్, విలాస్, అవినాష్ విపిన్, ప్రభాకర్, రవి, బాపురావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్,తది తరులు ఉన్నారు.