23 July, 2026 | 6:13 PM

చర్లలో కాంగ్రెస్ రాస్తారోకో

23-07-2026 05:27 PM

ప్రజాస్వామ్యంపై దాడి ఆపాలని డిమాండ్ - విజయ్ నాయుడు

చర్ల ,(విజయక్రాంతి): లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ చర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ రాస్తారోకో, నిరసన కార్యక్రమం నిర్వహించారు.  మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ నాయుడు ఆధ్వర్యంలో చర్ల మండల కేంద్రంలో జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల శాంతియుత నిరసనకు మద్దతు తెలిపినందుకు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని తీవ్రంగా ఖండించారు. 

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుడిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళి, ఆత్మ కమిటీ చైర్మన్ ఇందుల బుచ్చిబాబు, జిల్లా కమిటీ సభ్యులు సుందర్ సురేష్, సీనియర్ నాయకులు బ్రహ్మానంద రెడ్డి, లంక రాజు తదితరులు పాల్గొన్నారు.