అడ్మిషన్ లు ప్రారంభం.. విద్యార్థినిలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
22-05-2026 03:27 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం, కళాశాలలో అడ్మిషన్ లు జరుగుచున్నాయని ప్రిన్సిపల్ అరుణ తెలిపారు.6వ తరగతి లో 40సీట్లు ఉన్నాయని తెలిపారు.ఫస్ట్ ఇయర్ సీఈసీ గ్రూప్ లో 40 సీట్లు,ఎంపీహెచ్ డబ్ల్యూ గ్రూప్ లో 40 సీట్లు ఉన్నాయని తెలిపారు. 10వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థినీలు 10 వ తరగతి మెమో, ఆధార్ కార్డు తో సంప్రదించాలని తెలిపారు. 6వ తరగతి డ్రాప్ ఔట్ తల్లి తండ్రి లేని పిల్లలు దగ్గరలో హైస్కూల్ లేని వారికి ప్రాధాన్యత ఇస్తామని వారు తెలిపారు. కావున మండలంలోని విద్యార్థినిలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.






